Aadipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' వాయిదా.. 'సలార్' సంగతేంటి?

Prabhas: అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. ప్రభాస్ ఆదిపురుష్‌ను అఫీషియల్ గా వాయిదా వేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు సలార్ మూవీకి షాక్ తగిలింది. ఎందుకో తెలుసా.. ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ కు దగ్గరలోనే సలార్ రిలీజ్ డేట్ కూడా ఉంది.
మరి ఈ డేట్స్ లో ఇంకేమైనా మార్పులుంటాయా లేదా అనేది తెలియదు కానీ.. ఇప్పుడు సలార్ పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యిలా.. ఉంది. ఇంతకీ ఆదిపురుష్ ఏ డేట్ కు పోస్ట్ పోన్ అయింది. దానివల్ల సలార్ రిలీజ్ డేట్ కూడా మారుతుందా లేదా అనేది చూద్దాం.
ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆదిపురుష్ పై ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.
కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ దారుణమైన ట్రోల్స్ కు గురైంది. ఈ టీజర్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్ కు సరిపోయే రేంజ్ లో లేవన్న విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను పాజిటివ్ గా తీసుకున్న మేకర్స్ ఇప్పుడు మరికొంత వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఈ మార్పుల వల్ల వీఎఫ్‌ఎక్స్, సీజీ వర్క్ కోసం ఏకంగా మరో 100 కోట్లు అదనంగా ఆదిపురుష్ టీమ్ ఖర్చు చేయబోతోంది. అంటే మార్పులు భారీగానే ఉండబోతున్నాయని ఊహించవచ్చు. ఈ కారణంగా జనవరిలో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ ను జూన్ 16న విడుదల చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో సెప్టెంబర్ లో రిలీజ్ డేట్ పెట్టుకున్న సలార్ కు ఊహించని షాక్ తగిలింది.
ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ డేట్ లో మార్పులు వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ మేకర్స్ తో మాట్లాడుకోవడం కామన్. మరి వీళ్లు సలార్ మేకర్స్ తో అవన్నీ మాట్లాడుకున్న తర్వాతే ఆదిపురుష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారా లేక రాండమ్ గా వెళ్లారా అనేది ఇంకా క్లారిటీ లేదు.
బట్ ఇప్పుడు ఆదిపురుష్ కంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోన్న సలార్ పైనే ఫ్యాన్స్ ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. అలాంటి సినిమాను మరింత వెనక్కి నెడతారా లేక చెప్పినట్టుగానే సెప్టెంబర్ 30నే వస్తారా అనేదీ తేలాల్సి ఉంది. ఒకవేళ సలార్ కూడా సెప్టెంబర్ 30నే వస్తే ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ వచ్చినట్టే. ఒక మూవీ రికార్డ్స్ ను మరో మూవీ బీట్ చేస్తే ఆ జోష్ ఇండస్ట్రీకి కూడా కొత్త ఊపు తెస్తుందనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com