Prabhas: రెండు భాగాలుగా విడుదల కానున్న ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా..

Prabhas (tv5news.in)
Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అనగానే దానికి రెండు భాగాలు ఉండడం ఫ్యాషన్ అయిపోయింది. ముందుగా 'బాహుబలి'తో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 'కేజీఎఫ్' కూడా ఇంతే. అయితే అప్పటినుండి ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తున్నా.. దానికి రెండు భాగాలు ఉంటాయనే రూమర్స్ ఎక్కువయిపోతున్నాయి. తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాకు రెండు భాగాలు ఉంటాయన్న వార్త వైరల్‌గా మారింది.
చాలాకాలం తర్వాత 'రాధే శ్యామ్'తో ప్రేక్షకులను పలకరించాడు ప్రభాస్. తనకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌ను పక్కన పెట్టి ఓ ప్రేమకథను తెరకెక్కించాడు. కానీ అది తన అభిమానులను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకే అభిమానులంతా అప్పుడే తన తరువాతి చిత్రం కోసం ఎదరుచూడడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయిదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో చేస్తున్న 'ఆదిపురుష్' కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. అయితే ముందుగా ఆదిపురుష్‌ను ఒకభాగంగానే విడుదల చేయాలనుకున్నాడట ఓం రౌత్. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాడట. ఆదిపురుష్‌కు రెండు భాగాలు ఉంటే బాగుంటుందని డిసైడ్ అయ్యడట దర్శకుడు.
ఆదిపురుష్‌కు రెండు భాగాలు ఉండాలన్న ఐడియాను ప్రభాస్‌తో కూడా చర్చించాడట ఓం రౌత్. అయితే దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కానీ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆదిపురుష్ రెండో భాగం రావడానికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. మరి దీని గురించి మూవీ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com