ప్రభాస్ Adipurush Movie ప్రీ రిలీజ్ బిజినెస్ భేష్..!

ప్రభాస్ Adipurush Movie ప్రీ రిలీజ్ బిజినెస్ భేష్..!
సినిమా విడుదలవుతున్న అన్ని బాషల్లోనూ వేల టికెట్సు అమ్ముడవుతున్నాయి, ప్రత్యేకంగా సెలబ్రిటీలు టిక్కెట్లు కొని పంచి పెడుతున్నారు

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ( Prabhas ), బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ ( kriti sanon ), క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ మరో రెండు రోజుల్లో విడులవుతోంది. శ్రీరాముడు కథాంశంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన ఆదిపురుష్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి కూడా. మరోవైపు తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ కూడా వచ్చింది. దీంతో ఆదిపురుష్ కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మైథలాజికల్ కథాంశం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, రాముడుగా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న ప్రభాస్ నటించడంతో ఆదిపురుష్ పై ఎక్స్ పెక్టేషన్స్ దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా టీ సిరీస్ నిర్మాణంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో... బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సీత పాత్రలో నటించడంతో బాలీవుడ్ లోనూ ఆదిపురుష్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆదిపురుష్ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మేకర్స్ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చేయలేదు. శ్రీరామునికి చెందిన కథ కావడమే ఈ సినిమా హైప్ కి మేజర్ రీజన్. అయితే ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై పజ్ పెంచాయనడంలో డౌట్ లేదు. విజువల్ ఎఫెక్స్ట్ కూడా బాగున్నాయనిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాని రూపొందించడానికి దాదాపు 500ల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది Adipurush పై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. శాటిలైట్, డిజిటల్, ఆడియో వంటి నాన్ ధియేట్రికల్ రైట్స్ కే దాదాపు 250 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ధియేట్రికల్ బిజినెస్ 200ల కోట్లకు పైగానే జిరిగింది. నార్త్ ఇండియా బిజినెస్ పై ఇంకా క్లారిటీ లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే మేకర్స్ కి లాభాల పంట పండిందని చెప్పొచ్చు.

ఆదిపురుష్ కి అడ్వాన్స్ బుక్కింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా విడుదలవుతున్న అన్ని బాషల్లోనూ వేల టికెట్సు అమ్ముడవుతున్నాయి. ప్రత్యేకంగా సెలబ్రిటీలు టిక్కెట్లు కొని పంచి పెడుతున్నారు. ఇక తెలంగాణలో 50 రూపాయలు టిక్కెట్ రేట్ పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ ప్రకారం సింగిల్ స్క్రీన్ లో 236 రూపాయలు టిక్కెట్ ఉంటుంది. అదే త్రీడి అయితే 266 రూపాయలుగా ఉంది. మల్టిప్లెక్సుల్లో 300లకు పైనే టిక్కెట్ రేటు ఉంది. ఆంధ్రాలోనే 50 రూపాయల మేరకు పెంచే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఆదిపురుష్ కి మొదటి రోజు వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలాగే లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story