Prabhas: ఆ బాలీవుడ్ హీరో కోసం వెనక్కి తగ్గిన ప్రభాస్..

Prabhas (tv5news.in)
Prabhas: పాన్ ఇండియా సినిమాలన్నీ ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. అందుకే రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫూజన్ మొదలవ్వక తప్పట్లేదు. పైగా రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య కూడా గ్యాప్ ఉండకపోవడం కూడా కామన్‌గా మారిపోయింది. అయితే మూడు పాన్ ఇండియా సినిమాలు ఒకే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. అయితే ఓ బాలీవుడ్ స్టార్ కోసం ప్రభాస్ వెనక్కి తగ్గాడు. తన సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకున్నాడు.
ప్రభాస్ నటిస్తున్న మూడు పాన్ ఇండియా సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. అందులో ఇప్పటికే ఒక మూవీ 'రాధే శ్యామ్' మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ లైన్‌లో ఉన్నాయి. 2022 ఆగస్ట్ 11న ఆదిపురుష్ విడుదల కానుందని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే స్పష్టం చేసింది మూవీ టీమ్. అందుకే ఫాస్ట్‌గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ టీమ్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరత్వరగా పూర్తిచేసుకుంటుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రం ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తికాకపోవడంతో అప్పటికీ మూవీ రిలీజ్ కష్టం అని మూవీ టీమ్‌కు అర్థమయ్యింది. అందుకే ఆగస్ట్ 11న లాల్ సింగ్ చడ్డా రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే రోజును 'ఆదిపురుష్' ఎప్పుడో బ్లాక్ చేసింది.
ఆదిపురుష్, లాల్ సింగ్ చడ్డా ఒకేరోజు విడుదలయితే రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అందుకే ఆదిపురుష్ విడుదలను వాయిదా వేసుకోమని అమీర్ ఖాన్ వారిని కోరగా.. వారు కూడా వెంటనే ఒప్పుకున్నారని అమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆదిపురుష్ కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com