భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్.. నటీనటుల రెమ్యునరేషన్ కూడా..

భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్.. నటీనటుల రెమ్యునరేషన్ కూడా..
పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో కాంట్రావర్సీ మొదలైంది. ఇక ట్రైలర్ చూసి ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు..

పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో కాంట్రావర్సీ మొదలైంది. ఇక ట్రైలర్ చూసి ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు.. పురాణ ఇతిహాస కధలను తప్పుదారి పట్టిస్తున్నారని మేకర్స్‌పై విరుచుకుపడ్డారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్‌ ముఖ్య తారాగాణంగా విడుదలవుతోన్న ఈ చిత్రం కోసం భారీగా రెమ్యునరేషన్ సమర్పించుకుంటున్నారు నిర్మాతలు. ఆదిపురుష్ ప్రకటించినప్పటి నుంచి విపరీతమైన హంగామా సృష్టిస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కోసం నటీనటులు తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయానికొస్తే, ప్రభాస్ అతను దాదాపు రూ. 150 కోట్ల భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ తన పాత్రకు రూ. 12 కోట్లు, సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ రూ. 3 కోట్లు తీసుకుంటుండగా, సన్నీ సింగ్ రూ. 1.5 కోట్లు తీసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్‌కు దర్శకత్వం వహించిన ఓం రౌత్ ఆదిపురుష్‌కు పనిచేస్తున్నారు.

సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న స్టార్లలో ఒకరు. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ విజయాల తర్వాత నటుడి కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ప్రధాన నటులు సినిమాల్లో తమ పాత్రలకు అధికంగా డిమాండ్ చేస్తుంటారు. నిజానికి, సినిమా మొత్తం బడ్జెట్‌లో నటీనటుల రెమ్యునరేషనే ఎక్కువగా ఉంటుంది. అయితే, సినిమా విజయం నటీనటుల స్టార్ డమ్ పైన కాకుండా కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే పెర్‌ఫార్మెన్స్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత భారీ బడ్జెట్ చిత్రాలైనా కథలో పస లేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పికొడతారు.. ఇప్పటికే ఈ విషయం నిరూపితమైంది.

Tags

Read MoreRead Less
Next Story