Prabhas: తెరపైకి ప్రభాస్, అనుష్క.. మరోసారి హీరోహీరోయిన్లుగా..

Prabhas: టాలీవుడ్‌లో కొందరు నటీనటుల కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు క్రేజ్ ఎక్కువ. అందుకే ఆ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. అందులో ఒక కాంబినేషన్ ప్రభాస్, అనుష్క. వీరు మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించననున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.
టాలీవుడ్‌లో కొన్ని పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్, అనుష్క. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అయ్యిందంటే వీరిద్దరు నిజంగానే రియల్ లైఫ్ కపుల్స్ అయితే బాగుండు అని ప్రేక్షకులు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. ప్రభాస్‌తో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనుందట.
ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలకే సైన్ చేస్తున్నాడు. అయితే వాటన్నింటి మధ్యలో ఓ రిఫ్రెష్‌మెంట్ కోసం మారుతీ దర్శకత్వంలో 'రాజా డీలక్స్' అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తు్న్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారనే వార్త వైరల్ అయ్యింది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా అనుష్కను సెలక్ట్ చేసిందట మూవీ టీమ్. ఒకవేళ ప్రభాస్, అనుష్క మరోసారి కలిసి నటిస్తే అక్కడే సినిమా సగం సూపర్ హిట్ అని భావిస్తున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com