Prabhas-Gopichand : మరోసారి ప్రభాస్ విలన్ గా గోపించంద్

Prabhas-Gopichand : మరోసారి ప్రభాస్ విలన్ గా గోపించంద్
X

ప్రభాస్ హీరోగా గోపించంద్ విల్లన్ చేసిన వర్షం మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్, గోపించంద్ స్టార్ హీరోలుగా మారిపోయారు. కానీ ఆడియన్స్ మాత్రం మరోసారి ఈ ఇద్దరినీ ఒకే ఫేమ్ లో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు గోపిచంద్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలన్ పాత్రలు చేయడం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం విలన్ గా చేయాలనే ఉద్దేశంలేదు కానీ ప్రభాస్ సినిమాలో అయితే చేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక విశ్వం సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story