Prabhas : ప్రశాంత్ నీల్ తో సినిమా థియేటర్ లో ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ ఇంగ్లీష్ సినిమా చూసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడిని ఇప్పటి వరకూ చూడలేదు అని సలార్ టైమ్ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ప్రభాస్. సో.. ఆ రిలేషన్ కంటిన్యూ అవుతోంది అనుకోవచ్చు. ఇక తాజాగా ఈ ఇద్దరూ కలిసి హైదరాబాద్ ప్రసాద్స్ లోని పిసిఎక్స్ స్క్రీన్ లో హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ‘ఎఫ్ 1’ మూవీ చూడటం విశేషం. అందుకు సంబంధించిన ఓ స్టిల్ ఎలాగో బయటకు వచ్చింది. అంతే అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ఎఫ్ 1 చూశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ యేడాది డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. మరోవైపు ఫౌజీ (వర్కింగ్ టైటిల్ ) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సందీప్ రెడ్డి స్పిరిట్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత సలార్ 2 ఉండే అవకాశం ఉంది. ఇటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఓ రకంగా ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా టైమ్ తీసుకుని మరీ సినిమా చూశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com