Prabhas : ప్రభాస్ తో ప్రశాంత్ సినిమాకు ఎంత టైమ్ పడుతుంది..?

Prabhas :  ప్రభాస్ తో ప్రశాంత్ సినిమాకు ఎంత టైమ్ పడుతుంది..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే కాబట్టి ప్రతి మూవీకీ చాలా టైమ్ పడుతుంది. ప్రస్తుతం రాజా సాబ్ మూవీ చివరి దశలో ఉంది. ఈ యేడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తారు ఈ చిత్రాన్ని అనే న్యూస్ వినిపిస్తున్నాయి. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తున్నాడు. ఈమూవతో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. ఆపై చాలా రోజులుగా ఊరిస్తోన్న సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ రూపొందబోతోంది. వీటితో పాటు మళ్లీ సలార్ 2, కల్కి 2 అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాదని ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కు రావాలంటే అతని కథ అల్టిమేట్ అనేలా ఉండాలి. వినగానే గూస్ బంప్స్ అనే ఫీలింగ్ వస్తేనే సాధ్యం అవుతుంది. బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికే రెండేళ్లు పడుతుందంటున్నారు.

ఈ గ్యాప్ లో ప్రశాంత్ వర్మ కూడా రిషబ్ శెట్టితో జై హనుమాన్ రూపొందిస్తాడు. ఆ తర్వాతే ప్రభాస్ మూవీకి వస్తాడు. ఆలోగా ప్రభాస్ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు.. సీక్వెల్స్ చేయడం సాధ్యమా అంటే కష్టమే అని చెప్పాలి. అయితే రాజా సాబ్, ఫౌజీ చాలా వరకూ పూర్తయ్యాయి. అంటే స్పిరిట్ తో పాటు సీక్వెల్స్ మాత్రం ఎక్కువగా పెండింగ్ లో ఉంటాయి. అయితే ఒక్కసారి స్టార్ట్ అయితే సందీప్ చాలా వేగంగానే చిత్రీకరణ చేస్తాడు. ఇక సీక్వెల్స్ అంటే సలార్ 2 కు ముందు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ పూర్తి చేస్తాడు. ఇక మిగిలింది నాగ్ అశ్విన్. అతను ఇంకా కల్కి 2 కు సంబంధించి స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వంటివి స్టార్ట్ చేయలేదట. సో.. ఆ వైపు నుంచి మరీ పెద్ద ఒత్తిడి ఉండకపోవచ్చు. పైగా కల్కికి ఆశించినంత గొప్ప రిజల్ట్ ఏం రాలేదు. సో.. ఈ సారి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

ఏదైనా ప్రశాంత్ నీల్ కు ప్రభాస్ సినిమా వచ్చిన ఆనందం ఉన్నా.. అది స్టార్ట్ కావడానికి రిలీజ్ వరకూ రావడానికి మూడేళ్లు పట్టొచ్చు.

Tags

Next Story