Prabhas and Trisha : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన
వర్షం సినిమాలో ప్రభాస్, త్రిష చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. పదహారేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్ల వెండితెరపై కనిపించబోతుం దట. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కల్కి సీక్వెల్, సలార్ సీ క్వెల్తో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, హను రాఘవపూడి దర్శకత్వంతో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించను న్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉండగా త్వలోనే సెట్స్ మీదికి తీసు కెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉంటే ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా త్రిష నటించ నుందని తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ విషయమై త్రిషను సంప్రదించ గా ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై త్వర లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్రిష సైతం ఇటీవల మళ్లీ వరుస విజయాలతో లైమ్లేట్ లోకి వచ్చింది. బృంద సిరీస్ తో ఓటీటీలో సందడి చేస్తోంది త్రిష. ఇప్పుడు ప్రభాస్ సరసన 16 ఏండ్ల తర్వాత నటించబో తుండటం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com