Prabhas : RRRలో నాకు గెస్ట్ రోల్ ఎందుకివ్వలేదు .. రాజమౌళితో ప్రభాస్

Prabhas : RRRలో నాకు గెస్ట్ రోల్ ఎందుకివ్వలేదు .. రాజమౌళితో ప్రభాస్
X
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది...

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది... పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ భారీ బడ్జెట్‌‌తో ఈ సినిమాని నిర్మించారు.

అయితే మూవీ ప్రమోషన్‌‌లో భాగంగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి స్టార్ ప్రభాస్‌ని ఇంటర్వ్యూ చేశాడు.. అయితే జక్కన్న డైరెక్షన్‌‌లో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌లో తనకు అతిధి పాత్ర ఎందుకు ఇవ్వలేదని ప్రభాస్.. రాజమౌళిని అడిగాడు. తనని, జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే బాగుండేదని ప్రభాస్ అభిప్రాయపడ్డాడు.

దీనికి రాజమౌళి స్పందిస్తూ .. "ప్రభాస్ నువ్వు పెద్ద షిప్ లాంటోడివి. నిన్ని పట్టుకు రావాలంటే ఒక పర్పస్ ఉండాలి. అలా కాకుండా ఆ షిప్‌‌ని తీసుకుని వస్తే మిగిలిన సినిమా పోతోంది. సినిమాకు అవసరం అనిపిస్తే నిన్ను ఎలాగైనా ఒప్పించి తీసుకురాగలను" అని రాజమౌళి అన్నాడు. కాగా భారీ అంచనాలున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మార్చి25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Tags

Next Story