సినిమా

Prabhas : రెబల్ స్టార్‌‌కి డార్లింగ్ బర్త్ డే స్పెషల్ విషెస్

Prabhas : లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు (జనవరి 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Prabhas : రెబల్ స్టార్‌‌కి డార్లింగ్ బర్త్ డే స్పెషల్ విషెస్
X

Prabhas : లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నేడు (జనవరి 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు... ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు ఆయనకీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజుకి సోషల్ మీడియా ద్వారా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

"ది రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను. మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రభాస్. కృష్ణంరాజు కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్.. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా సందడి చేయబోతున్నారు.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని కరోనా వలన వాయిదా వేశారు మేకర్స్... సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Next Story

RELATED STORIES