Prabhas: 'అందుకే నాకింకా పెళ్లి కాలేదేమో'.. జర్నలిస్ట్ ప్రశ్నకు ప్రభాస్ ఆన్సర్..

Prabhas (tv5news.in)
Prabhas: 'రాధే శ్యామ్' సినిమా విడుదల ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడింది. చివరిగా ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఫైనల్‌గా సంక్రాంతి నుండి పోస్ట్‌పాన్ అయిన రాధే శ్యామ్.. మార్చి 11న విడుదలకు సిద్ధమయ్యింది. అయితే మూవీ టీమ్ ఈరోజు నుండే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు ఓ డిఫరెంట్ ప్రశ్న ఎదురయ్యింది.
'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదివరకే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఆ ఈవెంట్ సమయంలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా బయటికి వచ్చింది. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు రాధే శ్యామ్ నుండి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ విడుదలయ్యింది. అయితే రాధే శ్యామ్ హిందీ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కోసం మూవీ టీమ్ అంతా ముంబాయికు వెళ్లారు.
ముంబాయిలో రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ప్రభాస్‌ను 'రిలీజ్ ట్రైలర్‌లో 'ప్రేమ గురించి ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అనే డైలాగ్ ఉంది. అయితే మీ రియల్ లైఫ్‌లో కూడా అలా ఎప్పుడైనా ప్రిడిక్షన్ తప్పు అయ్యిందా' అని అడిగారు. దానికి ప్రభాస్.. 'చాలాసార్లు అయ్యింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు' అనుకుంటా అని సమాధానం ఇచ్చాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ కూడా ఒకడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com