Radhe Shyam : 'రాధేశ్యామ్'లో ప్రభాస్ ఎంట్రీ మాములుగా ఉండదు .. ఫ్యాన్స్ కి పండగేనట..!

Radhe Shyam : టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మూవీస్‌లో ప్రభాస్ 'రాధేశ్యామ్' ఒకటి.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు.
రాబోయే సినిమాలకి సంబంధించిన రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటాడు ఉమైర్ సంధు.. అలాగే 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్ ఎంట్రీ టేరిఫిక్ .. హీ లుక్స్ సో క్లాసీ అంటూ ట్వీట్ చేశాడు అతను.. ఉమైర్ సంధు చేసిన తాజా ట్వీట్ తో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.. హస్తసాముద్రికుడైన విక్రమాదిత్యగా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తుండగా అతనికి జోడీగా పూజా హేగ్దే నటించింది.
#Prabhas Entry scene is terrific in #RadheShyam. He looks so classy.
— Umair Sandhu (@UmairSandu) March 4, 2022
భాగ్యశ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ మరియు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధాకృష్ణ కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ కలిసి నిర్మించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com