Prabhas: శ్రీరామనవమిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు.. కానీ..

Prabhas (tv5news.in)
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల విషయంలో ఎంత స్పీడ్ పెంచాలి అనుకున్నా.. అది అసాధ్యంలాగా అనిపిస్తోంది. చాలాకాలం తర్వాత 'రాధే శ్యామ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు ఎక్కువయిపోయింది. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ అప్డేట్స్ వస్తాయనుకున్న ఫ్యాన్స్‌కు చివరికి నిరాశే మిగిలింది.
రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఫోకస్ అయిన సినిమాలు 'సలార్', 'ఆదిపురుష్'. అయితే ఆదిపురుష్ కథ.. రామాయణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది అనుకున్నారంతా. కానీ దర్శకుడు ఓం రౌత్.. ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌ను తన ట్విటర్‌లో షేర్ చేయడంతో అభిమానులకు నిరాశే ఎదురయ్యింది.
उफनता वीरता का सागर,
— Om Raut (@omraut) April 10, 2022
छलकती वात्सल्य की गागर।
जन्म हुआ प्रभु श्रीराम का,
झूमें नाचे हर जन घर नगर।।
Celebrating the victory of good over evil✨#ramnavmi #adipurush pic.twitter.com/Xbl1kOgZ7z
ఆదిపురుష్ విషయంలో కాదు.. అభిమానులు సలార్, రాజా డీలక్స్ సినిమాలపై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలమే అయ్యింది. అంతే కాకుండా చాలావరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అందుకే సలార్ నుండి గ్లింప్స్ విడుదలవుతుందో అనుకున్నారంతా. కానీ అదీ జరగలేదు. కనీసం ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రాజా డీలక్స్ అయినా పూజా కార్యక్రమం జరుపుకుంటుంది అనుకున్న వారికి కూడా నిరాశే మిగిలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com