Prabhas-Suriya : సూర్య కోసం ప్రభాస్
తమిళ స్టార్ సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశ పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ‘కంగువ’ ఆడియో లాంచ్ కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. అదేంటంటే తెలుగు, తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్స్‌కు అతిథులను ఫైనల్ చేశారు. తెలుగు ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తమిళ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ ఆహ్వానం అందిందట. దీనికి సంబంధించిన పోస్టులు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com