Prabhas : మరో మూడు పాన్ ఇండియా సినిమాలకి గ్రీన్ సిగ్నల్..!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోరు ఇప్పుడు మాములుగా లేదు.. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే ప్రభాస్ చేతిలో అయిదు పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇప్పుడు మరో మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.ఫుల్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథతో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందట.
ఇక టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారట. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించానున్నాడట. 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. హార్రర్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ రెండు కాకుండా దిల్‌రాజుతో మరో కొత్త ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలావుండగా ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఈ సంక్రాంతికి విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు కానీ కరోనా ప్రభావం వలన రిలీజ్ డేట్‌ని వాయిదా వేశారు. ఇందులో ప్రభాస్‌కి జోడిగా పూజా హేగ్దే నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com