Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి మొదలుపెట్టారు

Prabhas :   ప్రభాస్, హను రాఘవపూడి మొదలుపెట్టారు

డార్లింగ్ స్టార్ ప్రభాస్ మరో సినిమా మొదలుపెట్టేశాడు. ఇక నుంచి యేడాదికి రెండు సినిమాలైనా విడుద చేయాలనే టార్గెట్ తోనే అతను ముందుకు వెళుతున్నాడని చెబుతున్నారు. అది సాధ్యం అయితే కనుక టాలీవుడ్ కే కాదు.. ఇండియ్ సినిమా మార్కెట్ కే కొత్త కళ వస్తుందని చెప్పాలి. గతేడాది డిసెంబర్ లో సలార్ తో సత్తా చాటిన డార్లింగ్.. ఆరు నెలల్లోనే కల్కితో కమర్షియల్ హిట్స్ లో తనను కొట్టేవాడు లేడని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని అఫీషియల్ గానే ప్రకటించారు. మారుతి తర్వాత సందీప్ రెడ్డితో సినిమా అనుకున్నారు. బట్ దానికంటే ముందు హను రాఘవపూడితో ఓకే అయింది.

హను రాఘవపూడి వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టోరీ చెప్పాడట. ఆ యుద్ధానికి సుభాష్ చంద్రబోస్ ఫౌజీకి సంబంధం ఉంటుందని టాక్. అందుకే ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ నే పెడతారంటున్నారు. సుభాష్ చంద్రబోస్ తన సైన్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరే పెట్టారు. ఇక ఇవాళ ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ నెల 23 నుంచే రెగ్యులర్ షూటింగ్ కు వెళతారు. పూజా కార్యక్రమాన్ని పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్ లాగా నిర్వహించారు. మూవీకి సంబంధించిన వారితో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సో.. అన్నీ కుదిరితే ఈ మూవీ కూడా 2025లోనే విడుదలవుతుంది. అప్పుడు ప్రభాస్ అనుకుంటున్నట్టుగా యేడాదికి రెండు సినిమాలు అనే టార్గెట్ పెద్ద మేటర్ ఏం కాదు. మరోవైపు 2025 ప్రారంభంలోనే సందీప్ రెడ్డితో స్పిరిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ మూవీ పూర్తయ్యే టైమ్ కు సలార్ 2స్టార్ట్ అవుతుంది. సో 2026లో కూడా రెండు సినిమాలు విడుదలవుతాయి. మొత్తంగా హను రాఘవపూడి సీతారామం తర్వాత ప్రేక్షకులకు కొత్తగా కనిపించాడు. ఆ కొత్తదనం ఫౌజీతోనూ చూపిస్తే ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు.

Tags

Next Story