Tollywood: ప్రభాస్‌కు అనారోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు..

Tollywood: ప్రభాస్‌కు అనారోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు..
Tollywood: టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tolywood: టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకేసారి మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి. 'సాలార్', 'ఆదిపురుష', 'ప్రాజెక్ట్ కె' వంటి చిత్రాల షూటింగ్‌లతో బిజీ ఉన్న అతడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. కొన్ని శారీరక ఇబ్బందుల కారణంగా ప్రభాస్ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా ఆపేశారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వరుస షూటింగ్‌ల కారణంగా ప్రభాస్ విరామం తీసుకోకుండా పని చేస్తున్నారు. దాంతో అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుందని చిత్రబృందం సమాచారం అందించగా.. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తున్నాడు. రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. నటుడు సన్నీ సింగ్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టి-సిరీస్ మరియు రెట్రోఫైల్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణకుమార్ మరియు ఓం రౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూ తిరిగే భారతీయ ఇతిహాస కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

Tags

Next Story