Prabhas Insta Account Missing : ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ కనిపించడం లేదు..

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ కనిపించకుండా పోయింది. అభిమానులు ముద్దుగా 'డార్లింగ్' అని పిలుచుకునే ప్రభాస్... సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ వాటిల్లోనూ ఆయన పోస్టులు చేసేది అంతంత మాత్రమే. ఆయన కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే ఈ ప్లాట్ ఫారమ్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ కాస్త ఎక్కువగానే యూజ్ చేస్తున్నారు. ఇందులో ఆయన్ను కోటి మంది అంటే పది మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ ను ఓపెన్ చేసి ప్రభాస్ అని సెర్చ్ చేస్తే ప్రభాస్ అకౌంట్ ఏదీ కనిపించడం లేదు. ఫ్యాన్ మేడ్ అకౌంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒరిజినల్ & అఫీషియల్ అకౌంట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంటును వెనక్కి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ప్రభాస్ టీమ్ ఉందని తెలిస్తోంది. అయితే ప్రభాస్ అకౌంట్ ను ఎవరైనా హ్యాక్ చేశారా.. లేదంటే ఆయనే డీయాక్టివేట్ చేశారా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఆయన హీరోగా నటిస్తోన్న 'సాలార్' డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదల రోజే.. షారుఖ్ ఖాన్ 'డుంకీ' కూడా విడుదల అవుతోంది. రెండు సినిమాల మధ్య బలమైన పోటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 22న 'సాలార్' వస్తుండటంతో షారుఖ్ ఖాన్ 'డుంకీ' వాయిదా పడిందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే... అలాంటిదేమీ లేదని ఆ యూనిట్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని మరోసారి అర్థం అయ్యింది.
BREAKING: #Prabhas instagram account suspended/deleted/disabled. pic.twitter.com/eaiowm1R5d
— Manobala Vijayabalan (@ManobalaV) October 15, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com