Prabhas : దానంలో ప్రభాస్ నిజంగా కర్ణుడే

Prabhas : దానంలో ప్రభాస్ నిజంగా కర్ణుడే
X

పది రూపాయలు దానం చేసి ఇరవైసార్లు చెప్పుకునే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పెట్టే గుణం అందరికీ ఉండదు. అడిగిన వెంటనే కాదనుకుండా దానం చేసేవారినే కర్ణుడు అంటాం. అసలు అడగకుండానే దానం చేసేవారిని ఏం అనాలో కానీ.. అలాంటి వారి కోసం ఏదైనా గొప్ప మాట ఉంటే ఆ మాట ప్రభాస్ కు వర్తిస్తుంది. ఎందుకంటే అతనేం చేసినా భారీగానే ఉంటుంది. ఎవరికైనా భోజనం పెట్టినా షడ్రసోపేతంగా పెడతాడు. ఇక దానం విషయానికి వస్తే అందరికంటే కాస్త ఎక్కవగానే చేస్తాడు. గత కొన్నాళ్లుగా.. ముఖ్యంగా బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నాడు ప్రభాస్. ఈ మధ్య కాలంలో అతన చేసిన దానాలు చూస్తే..

కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం ప్రధానమంత్రి పిలుపునివ్వగానే 4 కోట్లు ఇచ్చాడు,

గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు 1 కోటి ఇచ్చాడు.

తెలంగాణ వరదలతో ఇబ్బంది పడితే 1.5 ఇచ్చాడు.

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ కోసం 35 లక్షలు డొనేట్ చేశాడు.

తాజాగా కేరళలో వయనాడ్ కోసం 2 కోట్లు దానం చేశాడు.

దీంతో పాటు 1650 ఎకరాల అడవిని దత్తత తీసుకుని ఆ అడవి బాధ్యత తనే తీసుకున్నాడు.

ఇవే కాదు.. ఇంకా ఎన్నో కోట్ల గుప్త దానాలు కూడా చేస్తూ.. దాతృత్వంలో తన తర్వాతే ఎవరైనా అనిపించుకుంటున్నాడు.

Tags

Next Story