Prabhas Kalki : కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది : అర్షద్ వార్సీ

కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కల్కి’ తాను చూశానని మూవీ తనకు నచ్చలేదని చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామతో పోలిస్తే, ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నారు. ఇక ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకు ఆయన లుక్ జోకర్‌లా ఉంది. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’’ అని అన్నారు. ప్రస్తుతం అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అహం, ఈర్ష్య కలిగిన మనస్తత్వాల వల్లే బాలీవుడ్ ఫెయిల్ అవుతోందని, ఇది నెపోటిజం మాఫియా అని మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com