IMDB List: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాప్ టెన్ లిస్ట్‌లో లేడు: సర్వే రిపోర్ట్

IMDB List: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. టాప్ టెన్ లిస్ట్‌లో లేడు: సర్వే రిపోర్ట్
IMDB List: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అని అభిమానులు గర్వంగా చెప్పుకున్నా.. నిజానికి ఆయన్ని పాన్ ఇండియన్ టాప్ స్టార్స్ లో ఒకడిగా చూడలేదు జనం.

IMDB List: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అని అభిమానులు గర్వంగా చెప్పుకున్నా.. నిజానికి ఆయన్ని ప్యాన్ ఇండియన్ టాప్ స్టార్స్ లో ఒకడుగా చూడలేదు జనం. కొన్ని సర్వే రిపోర్టులను బట్టి ఈ లిస్టు తయారు చేశారు.



ఈ సర్వేల్లో ఎవరూ ఊహించని స్టార్స్ కూడా టాప్ టెన్ లో చోటు సంపాదిస్తే.. ప్రభాస్ అసలు లిస్ట్ లోనే లేకుండా పోయాడు. దీంతో ఈ సర్వేపైనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఏంటి ఈ సర్వే ? ఎవరు నిర్వహించారు..? ఏ అంశాల ప్రాతిపదికన టాప్ టెన్ లిస్ట్ ను తయారు చేశారు.. అందులో ప్రభాస్ ఎందుకు లేడు.. ఇలా..ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ మదిలో.


ఇండియాలో చాలామంది నమ్మే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్.. ఐ.ఎమ్.డి.బి సంస్థ ఇండియాస్ టాప్ టెన్ పాపులర్ స్టార్స్ అంటూ ఓ సర్వే నిర్వహించింది. ఈ టాప్ టెన్ లో అసలు ప్రభాస్ కు చోటే లేకపోవడం విశేషం.



మరి ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో నెంబర్ వన్ ప్లేస్ లో ఎవరున్నారో తెలుసా.. ? ధనుష్‌. ఎప్పుడో ప్యాన్ ఇండియా మూవీస్ చేసిన ధనుష్‌.. బెస్ట్ యాక్టర్ గా రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. ఈ మధ్య హాలీవుడ్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. సో.. ధనుష్‌ నెంబర్ వన్ అంటే ఆశ్చర్యమేం లేదు..


ఇక వరుసగా ఈ లిస్ట్ లో ఎవరెవరికి చోటు ఉందో చూద్దాం..


అలియా భట్ కు సెకండ్ ప్లేస్, పొన్నియన్ సెల్వన్1 వంటి భారీ మల్టీస్టారర్ లో ఓ చిన్న పాత్ర చేసిన ఐశ్వర్య రాయ్ కి థర్డ్ ప్లేస్, రామ్ చరణ్‌ కు నాలుగో స్థానం దక్కింది. బ్యూటీ సమంతకు ఐదో స్థానం వచ్చింది. 2022లో భారీ డిజాస్టర్ మూవీ విక్రమ్ వేదలో నటించిన హృతిక్ రోషన్ కు ఆరో స్థానం వచ్చింది.



ఏడో స్థానంలో కియారా అద్వానీ నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ లిస్ట్ లో ఎనిమిదో స్థానం రావడం ఆశ్చర్యం. పుష్పరాజ్ అల్లు అర్జున్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక చివరగా పదో స్థానంలో నిలిచాడు కెజీఎఫ్ స్టార్ యశ్.

Tags

Read MoreRead Less
Next Story