Prabhas Spirit Movie: ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా అప్డేట్ విడుదల..

Prabhas Spirit Movie: ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వెలిగిపోతున్నాడు. అందుకే వరుసగా పాన్ ఇండియా సినిమాలనే సైన్ చేస్తూ.. ఒకేసారి మూడు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ సినిమాల గురించి ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఆయన కాల్ షీట్ల కోసం దర్శక నిర్మాతలు కూడా అంతే ఎదురుచూస్తుంటారు. ప్రభాస్‌కు కథలు వినిపించాలని ఎందరో దర్శకులు ఎదురుచూస్తుండగా ఒక యంగ్ డైరెక్టర్ తనతో సినిమా చేసే ఛాన్స్‌నే కొట్టేసాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ సినిమా స్టైల్‌నే మలుపుతిప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఒక ప్రేమకథను బోల్డ్‌గా చెప్పి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయొచ్చని సందీప్ నిరూపించాడు. అందుకే ఈ దర్శకుడు ఒక్క సినిమాతోనే మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయాడు. తన తరువాతి సినిమా ఎవరితోనో చెప్పకుండా సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేసిన సందీప్ ఇన్నాళ్లకు ఆ సస్పెన్స్‌కు తెరదించాడు.
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న మూవీ షూటింగ్‌ను వచ్చే నెల నుండి ప్రారంభించనున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ 25వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను కొట్టేసాడు సందీప్ వంగా. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి 'స్పిరిట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. దీనికి సంబంధించిన టైటిల్ లుక్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ టీమ్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com