'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన
Radhe Shyam Release Update: రెబల్ స్టార్ ప్రభాస్ అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు.

Radhe Shyam Release Update: రెబల్ స్టార్ ప్రభాస్ అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. తాజాగా ఆయన అభిమానులను సప్రైజ్ చేసే న్యూస్ ఒకటి వచ్చింది. 'రాధే శ్యామ్' మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానుందని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' రూపొందుతుంది. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

గోపీకృష్ణ మూవీస్‌..యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. మరో మూడు ప్యాన్ ఇండియన్ మూవీలతో ప్రభాస్ బీజీగా ఉన్నారు. ప్రభాస్ నాగ్ ప్రధాన పాత్రలో అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఈ మూవీకి సలార్ అనే టైటిల్ కన్ఫాం చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయింది. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. వాణీ కపూర్ , శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.Tags

Next Story