Radhe Shyam OTT : ఓటీటీలో రాధేశ్యామ్?.. ఎన్ని కోట్లు ఆఫర్ చేసిందో తెలుసా..!

Radhe Shyam OTT: మళ్లీ కరోనా పంజా విసరడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో పలు పాన్ ఇండియా చిత్రాలు విడుదలను వాయిదా వెసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ఇప్పటికే వాయిదా వేశారు. వాస్తవానికి ఈ సినిమాకి జనవరి 7 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.. కానీ పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఉండడంతో సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.
ఇదిలావుండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడుతుందన్నఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తామని అంటున్నారు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా సినిమాని పోస్ట్ పోన్ చేస్తారన్న చర్చ ఫిలింనగర్‌లో నడుస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట.. దేశంలో కేసులు మరిన్ని పెరిగి, ఆంక్షలు మరింత కఠినంగా ఉంటే ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 400 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. అయితే దీనిపైన మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
#RadheShyam
— Manobala Vijayabalan (@ManobalaV) January 3, 2022
₹400 cr is being offered by a leading OTT platform for direct release.#Prabhas
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com