Radheshyam Teaser : నేను దేవుడిని కాదు.. మీలో ఒకడిని కూడా కాదు.. రాధేశ్యామ్ టీజర్ అదుర్స్...!

Radheshyam Teaser : ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్' టీజర్ రానే వచ్చింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. 'నేను దేవుడిని కాదు.. మీలో ఒకడిని కూడా కాదు' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ చూస్తుంటే ఇది కంప్లీట్ డిఫిరెంట్ కథ అని తెలుస్తోంది. టీజర్‌తో సినిమా పైన అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది చిత్రయూనిట్... పూజా హేగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలిజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com