Prabhas Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. 2022 చివర్లో సలార్, 2023లో ఆదిపురుష్, కల్కితో మూవీతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన ప్రభాస్ 2025లో కూడా రెండు సినిమాలతో వస్తాడు అని భావించారు చాలామంది. బట్ చూస్తోంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అలాగని అస్సలు ఉండవు అని కూడా లేదు. కాకపోతే ఇప్పటికే బాగా ఆలస్యం అయిన రాజా సాబ్ ఏప్రిల్ 10న విడుదల చేస్తాం అని ప్రకటించారు. బట్.. ఆ డేట్ లో రాదు అని ప్రస్తుతం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఏప్రిల్ 10 నుంచి ఈ చిత్రం ఆల్మోస్ట్ వాయిదా పడినట్టే అంటున్నారు.
రాజా సాబ్ హారర్ ఎంటర్టైనర్. ఈ జానర్ మారుతికి కొట్టిన పిండి. కానీ ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు శిఖరం. దాన్ని మ్యాచ్ చేయడం అంత సులువేం కాదు. అయినా ప్రభాస్ నమ్మాడు అంటే మారుతి మరో బ్లాక్ బస్టర్ కు రెడీగా ఉన్నాడనే అర్థం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు చాలా ఎక్కువ టైమ్ పడుతుందట. అందుకే సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని టాక్. విఎఫ్ఎక్స్ సరిగా లేకపోతే అవుట్ పై ప్రభావం పడుతుంది. అది రిజల్ట్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే కాస్త లేట్ అయినా క్వాలిటీ అవుట్ పుట్ తోనే రావాలనే నిర్ణయంతో ఏప్రిల్ 10 నుంచి తప్పుకున్నారంటున్నారు. కొత్త డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారంటున్నారు.
కాకపోతే రిలీజ్ డేట్ ఇంకా నాలుగు నెలలకు పైగా ఉంది. అప్పుడే పోస్ట్ పోన్ అనే మాటలను కూడా నమ్మాల్సిన పనిలేదు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రావడం లేదు కాబట్టి ఎవరైనా కావాలని పనిగట్టుకుని పోస్ట్ పోన్ అనే రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు అనే బ్యాచ్ కూడా ఉంది. మరి ఏది నిజం అనేది మూవీ మేకర్స్ చెబితే బావుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com