Prabhas : ప్రభాస్, సందీప్ కు ముహూర్తం కుదిరింది

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ కు ప్యాన్ ఇండియా స్టార్స్ అంతా షాక్ అవుతున్నారు. కానీ ఆ లైనప్ ప్లానింగ్ లో వెళ్లడం లేదు. ఇది అభిమానులను డిజప్పాయింట్ చేస్తున్న విషయం. లేదంటే రాజా సాబ్ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ తను మాత్రం ఆగడం లేదు. ప్లానింగ్ ప్రకారం షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ రెండేళ్లలోనే ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ అంటున్నారు. ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగాతో రూపొందే స్పిరిట్ కూడా వచ్చే యేడాది రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ షూటింగే స్టార్ట్ కాలేదు. అలాంటిది స్పిరిట్ కూడా నెక్ట్స్ ఇయర్ వస్తుందని ఎలా చెప్పగలం అంటారా..? చెప్పొచ్చు. దానికో రీజన్ ఉంది.
రాజా సాబ్ షూటింగ్ దాదాపు చివరి స్టేజ్ లోనే ఉంది. ఫౌజీ సగానికి పైగా అయిపోయింది. ఈ యేడాది చివరి వరకూ టైమ్ తీసుకున్నా.. అందులో కొన్ని డేట్స్ స్పిరిట్ కు కేటాయించినా.. ఈజీగా వచ్చే యేడాది వచ్చేయొచ్చు.పైగా సందీప్ సినిమాల్లో పెద్దగా విఎఫ్ఎక్స్,గ్రాఫిక్స్ ఉండవు. మాగ్జిమం ఒరిజినల్ కంటెంటే ఉంటుంది. సో.. పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా పెద్దగా టైమ్ పట్టదు. అందుకే ఈ మూడు 2026 వరకూ ఆడియన్స్ ముందుకు వస్తాయి.
ఇక స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే కన్ఫ్యూజనర్ చాలామందిలో ఉంది. వారి కోసమే ఈ వార్త. స్పిరిట్ చిత్రాన్ని ఈ ఉగాదికి అఫీషియల్ గా ప్రారంభించబోతున్నారని సమాచారం. ఈ సమ్మర్ నుంచే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట సందీప్. అందుకోసం బల్క్ డేట్స్ ను అడుగుతున్నాడు. మరి ఆ డేట్స్ ను ప్రభాస్ కేటాయిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సందీప్ కు బల్క్ డేట్స్ ఇస్తే ఫౌజీ కంటే ముందే స్పిరిట్ వచ్చేస్తుందనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com