Prabhas : రాజమౌళితో ఇంకో సినిమా చేస్తా : ప్రభాస్

Prabhas : తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా కచ్చితంగా ఉంటుందని తెలిపాడు ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'.. మార్చి 11న సినిమా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రభాస్‌తో పాటుగా హీరోయిన్ పూజా హెగ్డే దర్శక, నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు ప్రభాస్. ఈ సందర్భంగా రాజమౌళితో కలిసి సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.
"రాజమౌళి, నేను మంచి స్నేహితులం. సినిమా చేయమని నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆయనతో సినిమా అంటే నేను రెడీగా ఉంటా.. నిజానికి మా ఇద్దరికీ ఓ చిన్న ప్లాన్ ఉంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి. కానీ సినిమా మాత్రం తప్పకుండ ఉంటుంది" అని ప్రభాస్ తెలిపాడు.
డార్లింగ్ ఇచ్చిన హింట్ తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రానికి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
