Prabhas : కేరళ కోసం ప్రభాస్ భారీ విరాళం

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రకృతి సృష్టించిన భీబత్సానికి ఎంతో అందమైన ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఒక విలయమే సంభవించింది. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే రాష్ట్రంలో వందలమంది చనిపోయారు. వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొన్ని ఊళ్లే కనుమరుగైపోయాయి. ఇలాంటి విపత్తుల వేళ దేశమంతా సంఘటితం అవుతుంది. మీకోసం మేమున్నాం అని ముందుకు వస్తుంది. అలా ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్లు తమ వంతుగా సాయం చేశారు. ఇప్పుడు ప్రభాస్ కూడా భారీ విరాళం అందించాడు.
కేరళ తిరిగి పూర్వ స్థితికి వచ్చేందుకు తన వంతుగా 2 కోట్ల రూపాయలు అందించాడు ప్రభాస్. ఈ మొత్తాన్ని అక్కడి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. మామూలుగా ఇలాంటి పరిస్థితులు ఎవరికి వచ్చినా ప్రభాస్ బాహుబలి రేంజ్ లో సాయం అందిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కేరళకు రెండు కోట్లతో తన పెద్ద హృదయాన్ని మరోసారి చాటుకుని నిజంగా నువ్వు డార్లింగ్ వే అనిపించుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com