Prabhas : ప్రభాస్ టెస్ట్ షూట్ అదిరిపోయిందిగా

Prabhas :  ప్రభాస్ టెస్ట్ షూట్ అదిరిపోయిందిగా
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించే సినిమాల లిస్ట్ పెరుగుతూ ఉంటోంది. వరుసగా మూవీస్ వస్తున్నాయి కూడా. కాకపోతే రిలీజ్ ల విషయంలో మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. రాజా సాబ్ ఈ యేడాది సమ్మర్ లో విడుదలవుతుంది అనుకున్నారు. ఫైనల్ గా ఈ సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం జనవరి 9నే విడుదల కాబోతోంది. జనవరి 8నే ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. తర్వాత ఫౌజీ, కల్కి 2, సలార్ 2 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. సెకండ్ పార్ట్ మూవీస్ కంటే కూడా స్పిరిట్ మూవీ విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ విషయంలోనే ఇప్పుడు మాట్లాడుతున్నాం.

స్పిరిట్ మూవీ టెస్ట్ షూట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ టెస్ట్ షూట్ ను అదిరిపోయింది. అసలు స్పిరిట్ మూవీలో ఉండే యాంబియన్స్ కంటే కూడా అగ్రెషన్ మాత్రం హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట. దీంతో ప్రభాస్ లుక్ తో పాటు అగ్రెషన్ యాటిట్యూడ్ కూడా హైలెట్ అయ్యేలా టెస్ట్ షూట్ లో చూపించాడట దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సెట్ చేశాడట. త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతున్నాడు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలనుకుంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి. మొత్తంగా టెస్ట్ షూట్ తో సినిమా హైలెట్ కాబోతోంది అనిపించేలా ఉన్నాడు సందీప్ రెడ్డి.

Tags

Next Story