Prabhas : సింగం అగైన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్
అజయ్ దేవ్ గణ్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ‘సింగమ్ అగైన్’. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ బజ్ కు బలాన్నిస్తోంది.‘ఈ హీరో లేకపోతే మూవీ అన్ కంప్లీట్ గా ఉంటుంది. దీపావళికి ఈ స్కార్పియోలోని యాక్టర్ సందడి చేయనున్నాడు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది’ అంటూ రోహిత్ శెట్టి ఓ పోస్ట్ చేశాడు. దీంతో పాటు స్కార్పియో వస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు ‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్ ను వాడటంతో ఆ కారులో ఉన్న ప్రభాస్ నేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే, ఈ గెస్ట్ రోల్ లో సూర్య కనిపించవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. సూర్య నటించిన ‘సింగం’ సిరిస్ సినిమాలు బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. వాటినే బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ హీరోగా రోహిత్ శెట్టి రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. దీంతో సింగమ్ అగైన్ లో సూర్య కనిపించవచ్చే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగం అగైన్ లో అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పడుకొనె నటిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com