Prabhas : 4 నెలల పాటు సినిమాలకు బ్రేక్

Prabhas : 4 నెలల పాటు సినిమాలకు బ్రేక్
ప్రభాస్ 'సాలార్' అసలు రిలీజ్ చేస్తారా..? చేయరా..?

పలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన 4నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండనున్నట్టు ఈ వార్త సారాంశం. ప్రస్తుతం ప్రభాస్ సాలార్‌ షూటింగ్ లో నిమగ్నమైనాడు. ఈ మూవీని విడుదల ఇటీవలే నిరవధికంగా వాయిదా వేసినట్టు అనధికారికంగా వెల్లడైంది. కానీ దీని పైనా ఇంకా మేకర్స్ స్పందించలేదు, కొత్త విడుదల తేదీని వెల్లడించలేదు.

మోకాలికి శస్త్ర చికిత్స కోసం ప్రభాస్ యూరప్ వెళ్లినట్లు తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది. ఆయన 1 లేదా 2 నెలలు అక్కడ ఉంటాడని భావిస్తున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మళ్లీ 6 నుంచి 7 వారాల విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే, అతను వచ్చే 4 నెలల వరకు ఏ సినిమా షూట్‌లకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా సెట్‌లకు 2024లోనే తిరిగి వస్తాడని పలువురు చర్చించుకుంటున్నారు.

సాలార్‌తో పాటు, ప్రభాస్‌ చేతిలో 'కల్కి 2898 AD', మారుతితో ఓ చిత్రం, 'స్పిరిట్', 'కన్నప్ప'లో ప్రత్యేక అతిధి పాత్రతో సహా అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక 'సాలార్' విషయానికొస్తే.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే మేకర్స్.. ఫ్యాన్స్ కు షాకిచ్చే విషయం చెప్పారు. దీన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఇప్పటికే ఇది అనధికారికంగానే సినిమా వాయిదా అంటూ కన్ఫర్మ్ అయ్యిపోయింది. కానీ ఇప్పుడు డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇది మినహా మిగతా భారీ చిత్రాలు డేట్ లు కూడా వచ్చేస్తున్నాయి.

ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఈ సినిమాను యూనిట్ మాత్రం విడుదల దగ్గరకి వస్తున్నా ట్రైలర్ కూడా వదలకుండా మేకర్స్ చాలా కామ్ గా ఉన్నారు. దీంతో 'సాలార్' కొత్త డేట్ ఏమో గానీ అసలు రిలీజ్ ఉందా లేదా అనేది మరింత సస్పెన్స్ ఫుల్ ప్రశ్నగా మారింది. అయితే అభిమానులు మాత్రం ప్రస్తుతానికి ఉన్న పలు రూమర్ డేట్స్ లో మాత్రం నవంబర్ 10 డేట్ కి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story