Varsham : వర్షానికి 18 ఏళ్ళు... ఇద్దరు స్టార్ హీరోల మధ్య వచ్చి బ్లాక్‌‌‌బస్టర్..!

Varsham : వర్షానికి 18 ఏళ్ళు... ఇద్దరు స్టార్ హీరోల మధ్య వచ్చి బ్లాక్‌‌‌బస్టర్..!
Varsham : అంతకుముందు మహేష్ బాబుతో బాబీ అనే సినిమాని తీశారు శోభన్.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈ రకంగా డైరక్షన్ ఛాన్స్ వచ్చింది.

Varsham : లవ్‌‌స్టోరీలకి కమర్షియల్ హంగులను జత చేసి హిట్ కొట్టిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.. కానీ అదే లవ్‌స్టోరీకి ఓ వర్షాన్ని జత చేస్తే... అదే వర్షం ఆ లవ్‌‌కి మెయిన్ టర్నింగ్ పాయింట్ అయితే ఎలా ఉంటుంది.. ముందుగా వినగానే నిర్మాత ఎంఎస్ రాజు వావ్ అనిపించింది. దీని చుట్టు కథ అల్లారు రైటర్ వీరుపొట్ల. స్క్రీన్ ప్లేలో శోభన్ చాలా ఐడియాలు చెప్పారు. సినిమాలో మోస్ట్ సీన్స్ శోభన్ చెప్పినవే కావడంతో దర్శకుడిగా శోభన్‌‌నే చేయమని ఛాన్స్ ఇచ్చారు నిర్మాత రాజు.

అంతకుముందు మహేష్ బాబుతో బాబీ అనే సినిమాని తీశారు శోభన్.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈ రకంగా డైరక్షన్ ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు శోభన్.. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశారు. హీరోగా ప్రభాస్... హీరోయిన్‌‌గా ముందుగా అదితి అగర్వాల్‌‌ని అనుకున్నారు.. ఫైనల్‌‌గా త్రిషని తీసుకున్నారు. విలన్‌‌గా గోపీచంద్‌‌ని సెలెక్ట్ చేశారు. సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మాత రాజు. అదే సంక్రాంతికి ఇండస్ట్రీ టాప్ హీరోలైన బాలకృష్ణ లక్ష్మీనరసింహ, చిరంజీవి అంజి చిత్రాలు రిలీజ్‌‌కి సిద్దమయ్యాయి.

అయినప్పటికీ నిర్మాత రాజు ఏ మాత్రం భయపడకుండా వర్షం సినిమాని అనుకున్న టైంకి సంక్రాంతి బరిలో దించారు. జనవరి 14 2004న ధియేటర్‌‌లలో రిలీజై నిర్మాత రాజుకి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రభాస్ టాప్ హీరో, త్రిష టాప్ హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా దేవిశ్రీప్రసాద్‌‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పెట్టిన బడ్జెట్‌‌కి ఏకంగా త్రిబుల్ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా సంక్రాంతి సినిమా అనిపించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది వర్షం.

ఈ సినిమా 175రోజుల వేడుకకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం విశేషంగా చెప్పాలి. ఇక ఈ సినిమాని తమిళంలో మజైగా , ఒడియాలో బర్సా మై డార్లింగ్‌గా , హిందీలో బాఘీగా రీమేక్ చేశారు. అన్ని చోట్లల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ వర్షం సినిమా మాత్రం ఆయన అభిమానులకి ఎప్పటికి ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పాలి.

నువ్వొస్తానంటే నేనోద్దంటానా అనే పాటకి గాను సింగర్ చిత్రకి, ఆ పాటకి కోరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకి, నటించిన త్రిషకి కూడా నంది అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత నువ్వొస్తానంటే నేనోద్దంటానా అనే టైటిల్ తో ఓ సిద్దార్థ్, త్రిషతో సినిమాని తెరకెక్కించారు నిర్మాత రాజు.. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకుడు కావడం, ఆయనకి ఇది మొదటి సినిమా కావడం విశేషం కాగా, ఆ సినిమా కూడా 2005 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్‌ ‌బస్టర్ అవ్వడం మరో విశేషం.

Tags

Read MoreRead Less
Next Story