Prabhas : ఆ హీరోయిన్‌కు ప్రభాస్ బర్త్‌డే విషెస్..

Prabhas : ఆ హీరోయిన్‌కు ప్రభాస్ బర్త్‌డే విషెస్..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చాలా తక్కువ. ఈ రోజు కృతి సనన్ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆమెకు బర్త్‌డే విషస్ తెలుపుతూ ప్రభాస్ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే కృతి సనన్.. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి.. ఆదిపురుష్‌లో మీ మ్యాజిక్‌ను ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను అని పోస్ట్ చేశారు రెబల్ స్టార్.

ఓం రౌత్ డైరక్షన్‌లో తెరెకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ నటంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, సీతగా కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ నటించారు. 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా పలు భాసల్లో ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.






Tags

Read MoreRead Less
Next Story