Prabhas : ప్రభాస్ నువ్వు మారాలి చాలా

Prabhas :  ప్రభాస్ నువ్వు మారాలి చాలా
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మూవీ దారుణంగా పరాజయం అయింది. ఇంత పెద్ద డిజాస్టర్ వస్తుందని బహుశా ప్రేక్షకులు కూడా అంచనా వేయలేదు. ఇలాంటి మూవీతో ప్రభాస్ అంత పెద్ద ఫ్లాప్ చూడ్డం మాత్రం అభిమానులు మరింతగా షాక్ అయ్యారు. అయితే ఈ మూవీ మాత్రమేనా.. ? అంటే కాదు. ప్రభాస్ చేస్తున్న మూవీస్ విషయంలో చాలా అంచనాలు ఉండటం.. ఆ స్థాయిలో సినిమాలు కనిపించడం అనేది కామన్ గా అయిపోయిందీ మధ్య. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో మూవీస్ చేయాలని చాలామంది అనుకున్నారు. వెంటనే చేసిన సాహో.. ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫ్లాప్ గా మిగిలిపోయింది.తర్వాత చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. మామూలుగా అయితే ఈ తరహా సినిమాల నుంచి ఎవరూ ఫ్లాప్ ను అంచనా వేయలేరు. ఖచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ వస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. బట్ ఆ మూడు సినిమాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి.

ఇక సలార్ 1 విషయంలో హిట్ అయింది అనిపించుకుంది. అది కూడా అంచనాలకు తగ్గట్టుగా అవుట్ పుట్ రాలేదు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి డైలాగ్స్ లేకపోవడం మాత్రం దారుణంగా అనిపించింది. ఇది కూడా వెయ్యి కోట్లు అందుకుంటుంది అనుకున్నారు. బట్ రాలేదు. తర్వాత చేసిన కల్కి 1 విషయంలో ప్రభాస్ నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా హిట్ అనిపించుకుంది. బట్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మాత్రం దారుణంగా విమర్శల పాలైంది. అతని పాత్రపై ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ కూడా వెయ్యి కోట్లు అందుకోలేకపోయింది. ఇక తాజాగా రాజా సాబ్.. ఈ మూవీ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. కనీసం మూడు వందల కోట్లు కూడా అందుకోలేకపోయిందీ మూవీ. ఈ విషయంలో ప్రభాస్ ఓ రకంగా నవ్వుల పాలయ్యాడు. కేవలం దర్శకుడుని నమ్మితే కథలు ఇలాగే వస్తాయి అనే కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడిని బ్లైండ్ గా నమ్మేసి, కేవలం తన రెమ్యూనరేషన్ పైనే ఫోకస్ పెట్టడమే ఇలాగే అవుతాయి అంటున్నారు.

మొత్తంగా ఇకనైనా ప్రభాస్ మారాలి. కథల ఎంపికపై చాలా శ్రద్ధగా ఉన్నాడు. స్క్రీన్ ప్లే పై కూడా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఆయా సినిమాల పట్ల చాలా ఎక్కువగా ఆలోచించాలి. అప్పుడే సినిమాల అవుట్ పుట్స్ మారతాయి. లేదంటే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ‘ప్యాన్ ఇండియా స్టార్’ అనే అతని ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కేవలం బాహుబలితో మాత్రమే ఆ ఇమేజ్ ఆగిపోతుంది. లేదంటే ఇదే కంటిన్యూ అయితే మాత్రం మళ్లీ సాధారణ తెలుగు హీరోగా పాత ప్రభాస్ లా అయిపోతాడు.

Tags

Next Story