Praneetha Subhash : బ్లాక్ లో షేక్ చేసిన ప్రణీత

Praneetha Subhash : బ్లాక్ లో షేక్ చేసిన ప్రణీత
X

ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో 2010లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ప్రణీతా సుభాష్.. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో ఫేమస్ అయ్యిందీ కన్నడ భామ. తర్వాత పాండవులు, పాండవులు తుమ్మెద, రభస, డైనమెట్, హలో గురు ప్రేమకోసమే.. తదితర చిత్రాల్లో నటించిందీ భామ. హంగామా 2 చిత్రంలో ఆమె నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదలైంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. 2003 చిత్రం హంగామాకు సీక్వెల్ ఈ మూవీ. ప్రణీత వివాహం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో 2021 మే 30న జరిగింది. ఆమె 2022 జూన్ 10న పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత సోషల్ మీడియాలో బిజీగా గడుపుతోంది. ఫొటో షూట్స్ చేస్తోంది. తన అందాలు ఆరబోస్తూ.. ఇన్ స్టా వేదికగా అభిమానులను పలకరిస్తోంది. ఇటీవల బ్లాక్ డ్రెస్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించింది ప్రణీత. ఈ ఫొటోలను చూసిన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. రీ ఎంట్రీ ఎప్పుడిస్తున్నారని అడుగుతున్నారు.

Tags

Next Story