Pranitha : ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రణీత..ఫోటోలు వైరల్

‘ఏం పిల్లో.. ఏం పిల్లడో' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించినా.. ఎందులో మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ కథానాయికగానే ఈ అమ్మడికి వరుస అవకాశాలొచ్చాయి. సౌత్‌లో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ మలయాళంలో మాత్రం నటించలేదు. కానీ హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాలతో పలకరించింది. అయితే ప్రణీత 2021 మే 30న కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వయసు మూడున్నర పదులు దాటిపోతోంది. అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఘాటు అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రణీత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఆ క్రమంలోనే తాజాగా క్రేజీ ఫొటోలను పంచుకుంంది. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com