సినిమా

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి ముందు సీజన్ల కంటెస్టెంట్స్.. సేమ్ సీన్ రిపీట్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో తెలియడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి ముందు సీజన్ల కంటెస్టెంట్స్.. సేమ్ సీన్ రిపీట్..
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు చివరి వారానికి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో తెలియడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది. ప్రస్తుతం టాప్ 5లో సన్నీ, షన్నూ, సిరి, శ్రీరామచంద్ర, మానస్ ఉన్నారు. ఎలాగో హౌస్‌లో చివరి వారం కాబట్టి వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే బిగ్ బాస్ 4లో జరిగిన ఒక సీన్ బిగ్ బాస్ 5లో కూడా రిపీట్ కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఏ భాషలో అయినా బిగ్ బాస్ చివరి వారం చేరుకున్న తర్వాత హౌస్‌మేట్స్‌లో మునుపటి లాగా టాస్క్‌లు ఆడించే పనులేమీ ఉండవు. టాప్ 5లో ఉన్న అందరు ఆ సీజన్‌లో ఎదుర్కున్న కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అని చెప్తూనే.. వారిని ఒకరికి ఒకరు దగ్గర చేసే ప్రయత్నం చేస్తాడు బిగ్ బాస్. ఈసారి కూడా అలాగే జరగనుంది అని అర్థమవుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో చివరి వారం అంతకు ముందు సీజన్ల కంటెస్టెంట్స్ టాప్ 5లో ఉన్న హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి హరితేజ, రెండవ సీజన్ నుండి గీతామాధురి, మూడవ సీజన్ నుండి శ్రీముఖి, ఆలీ రెజా వచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్‌తో కాసేపు ముచ్చటించి, వారికి సలహాలను కూడా అందించారు.

ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కానుందని టాక్. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5 హౌస్‌మేట్స్‌ను ప్రశ్నలు అడిగారు. అయితే ఈసారి ప్రశ్నలు అడగడానికి గడిచిపోయిన సీజన్స్‌లోని కంటెస్టెంట్స్ రానున్నారని టాక్ వినిపిస్తోంది. అలా అయితే ఏ కంటెస్టెంట్స్ వస్తారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఇప్పటినుండే ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES