Priyamani : ఆ మాటలకు బాధేసింది

Priyamani : ఆ మాటలకు బాధేసింది
X

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రెటీలపై ఎవరు పడితే వారు ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయడం పట్ల హీరోయిన్స్ బాదపడ్డ సందర్భాలు కూడా ఎక్కువే. తాజాగా సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్ పై స్పందించారు హీరోయిన్ ప్రియమణి. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ "ముస్తాఫా రాజ్ నాకు చాలా కాలంగా తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పుటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని దారుణంగా ట్రోల్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు పట్టించుకోను. కానీ ఆ మాటలకు చాలా బాధపడ్డాను. కులమతాలకతీతంగా పళ్లి చేసుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. కానీ నన్ను ఎక్కువగా టార్గెట్ చేశారు" అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.

Tags

Next Story