Priyanka Chopra : రొమాంటిక్ మూడ్ లో ప్రియాంక చోప్రా

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా కావడం విశేషం. అలాగే హిందీలో రాబోతున్న క్రిష్ 4లోనూ పీసీ కనిపించనుందని టాక్. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్టు పిక్స్ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా 'మెట్ 25' అంటూ ప్రియాంక చోప్రా ఫొటోలను షేర్ చేసింది. సిల్వర్ కలర్ ఔట్ ఫిట్ తో పీసీ మెరిసిపోతుంది. ఇందులోనే నిక్ సైతం ఉండటంతో మరింత నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com