Producer Accuses : రూ.75 లక్షలు తీసుకుని నితిన్ హ్యాండిచ్చాడు: నిర్మాత

హీరో నితిన్‌పై నిర్మాత, డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండిచ్చారని చెప్పారు. ఆ సమయంలో ‘అఆ’ పెద్ద హిట్టవడంతో వశిష్ఠతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. తర్వాత వశిష్ఠ ‘బింబిసార’తో హిట్ కొట్టాడని చెప్పారు.
మా వాడికి అల్లు శిరీష్ క్లోజ్‌ఫ్రెండ్. మంచి కథ రాసుకోరా.. నేనే చేస్తా అని శిరీష్ ముందుకొచ్చాడు. సినిమా ముహూర్తం కూడా భారీగా జరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీరస్తు.. శుభమస్తు సినిమా వచ్చి హిట్టయింది. దాంతో ఇలాంటి విజయం తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయడం ఎందుకు? అని శిరీష్ ఆలోచనలో పడ్డాడు. మాతో సినిమా చేయనన్నాడు. అల్లు అరవింద్ ఫీలయ్యాడు. నీకు ఎవరు కావాలో చెప్పు.. హీరోగా తీసుకొస్తా అని అరవింద్ మావాడిని అడిగాడని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com