TFDC Chairman : టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు

సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.
తెలంగాణౌ లోని నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లిలో దిల్ రాజు జన్మించారు. ముదక్‌పల్లి, నిజామాబాద్‌లలో చదివిన ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారం చేశాడు. 1990లో పెళ్లి పందిరి (1997) చిత్రంతో మూవీ డిస్ట్రిబ్యూటర్‌గా కేరీర్‌ను ఆరంభించి ఆర్థికంగా ఎదిగారు. 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి ‘దిల్’ సినిమాతో బంపర్ హిట్ కొట్టారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్‌వన్ నిర్మాతగా దిల్ రాజు కొనసాగుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com