Producer Kedar : దుబాయ్ లో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి

ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన మృతి చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నే పథ్యంలో, దుబాయ్ పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఆయన మరణంలో ఎటువంటి కుట్ర లేదని స్పష్టీకరించారు. దీంతో ఆయన మృతదేహాన్ని భార్య రేఖా వీణకు అప్పగించారు. దీంతో ఇవాళ ఉదయం అక్కడే కేదార్ అంత్యక్రియలు నిర్వహించారు. అటు టాలీవుడ్ వర్గాల్లో, రాజకీయ వర్గా ల్లో సంచలనం రేపిన కేదార్ మరణం సహజ మరణమేనని అధికారులు ధ్రువీకరించారు. ఈ కేసును కొన్ని వర్గాలు వివిధ కోణాల్లో విశ్లేషించిన క్రమంలో దర్యాప్తు జరిపిన పోలీసులు అనుమానాలు క్లియర్ చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే కేదార్ అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రము ఖులు దూరంగా ఉన్నారు. పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అం త్యక్రియలు పూర్తయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com