Producer Shirish : రామ్ చరణ్ ఫ్యాన్స్ దెబ్బకు సారీ చెప్పిన నిర్మాత శిరీష్

రామ్ చరణ్ ఫ్యాన్స్ దెబ్బకు నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ దిగొచ్చారు. రామ్ చరణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. చరణ్ ను అవమానించే ఉద్దేశం లేదని.. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారన్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చెయ్యమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎందుకు కించపరుస్తానని శిరీష్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే చరణ్ తో మరో సినిమా చేస్తామని శిరీష్ ప్రకటించారు.
కాగా రామ్ చరణ్ హీరోగా నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ ఫలితంపై శిరీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆ మూవీ హీరో, డైరెక్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని.. సినిమా ఫ్లాప్ తర్వాత తమను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో రామ్‌చరణ్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారని ఫైర్ అయ్యారు. దీంతో శిరీష్ సారీ చెప్పాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com