Project K: అమెరికా కామికాన్‌లో ప్రాజెక్ట్-K సందడి

Project K: అమెరికా కామికాన్‌లో ప్రాజెక్ట్-K సందడి
X
ఐరన్‌మ్యాన్ తరహా సూట్‌లో ఉన్న ప్రభాస్ పోజు ఆకట్టుకుంటోంది.

Project-K Movie: ప్రాజెక్ట్-కే సినిమాకి సంబంధించి మొదటి గ్లింప్స్(Glimps) అమెరికాలోని శాన్‌డీయాగో(Sandeago)లో జులై 20 నుంచి 23 వరకు జరగనున్న కామికాన్లో(Comic-Con) ఆవిష్కరించనున్నారు. బుధవారం నాడు అమెరికాలో హీరో ప్రభాస్(Prabhas) ప్రత్యక్షమయ్యాడు. అక్కడి ప్రేక్షకులతో ముచ్చటించాడు. పలువురు ఫ్యాన్స్‌కి సినిమాకి సంబంధించిన సీన్లు చూయించినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.కామికాన్‌లో ప్రాజెక్ట్-కేకి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ని ప్రదర్శించనున్నారు. శాన్‌డీయాగో కామికాన్‌లో ప్రదర్శించనున్న మొట్టమొదటి సినిమాగా ప్రాజెక్ట్-కే నిలవనుంది. అదే రోజున సినిమాకి సంబంధించిన టైటిల్(Title), ట్రైలర్(Trailer), విడుదల తేదీల(Release Date)ను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మిస్ అవనున్నట్లు సమాచారం.

సీనియర్ నటుడు కమల్ హాసన్‌(Kamal Hasan), రానా దగ్గుబాటి(Rana Daggubati)లతో కలిసి ఉన్న ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు ప్రాజెక్ట్-కే(Project-Kjr) కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఐరన్‌మ్యాన్ తరహా సూట్‌లో ఉన్న ప్రభాస్ పోజు ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్‌లు నటిస్తున్నారు. విభిన్న భాషల్లో ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

Tags

Next Story