Puri Jagannadh : జీవితంలో ఒంటరిగా ఉండగలగటం పవర్ .. పూరీ ఫిలాసఫీ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్లో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. పూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో వివిధ అంశాలపై తన భావాలను చెప్తుంటాడు. వీటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండగా.. వీటికి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ వారం పవర్ ఫిలాసఫీ అంటూ వచ్చేశాడు. 'నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం పవర్ కాదు. అవి నాకు వద్దు అనుకోవడం పవర్. జీవితంలో కొన్ని కొన్ని వదులుకునే సత్తా ఉండటం పవర్. చెయ్యి చాపడం పవర్ కాదు. దానం చేయడం పవర్. పదిమందికి పంచడం పవర్. చాలా విషయాల్లో చాలా మందికి నో చెప్పగలగాలి. కానీ అలా చెప్పకపోవడం పవర్. జీవితంలో ఒంటరిగా ఉండగలగటం పవర్. నాకు పిల్లలు వద్దనుకోవడం పవర్. ఒంటరిగా నీతో నువ్వు కూర్చోగలగడం.. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగలగడం. ఎవరి మీద ఆధారపడకుండా బతకడం పవర్' అంటూ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com