Pusha 2 Review : పుష్ప 2 రివ్యూ.. హైలైట్స్ ఇవే

Pusha 2 Review : పుష్ప 2 రివ్యూ.. హైలైట్స్ ఇవే
X

దేశమంతటా పుష్ప 2 వేవ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలవుతోంది. అర్ధరాత్రి ప్రీమియర్లు చూసిన అభిమానులు అక్కడున్న మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పబ్లిక్ టాక్ ను బట్టి చూస్తే పుష్ప 2 బ్లాక్ బస్టర్ అని తేటతెల్లం అవుతోంది. ఓ కూలీ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ డాన్ గా ఎలా ఎదిగాడు.. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుని ఇండస్ట్రీని ఎలా రూలింగ్ చేశాడు.. ఎలా మంచిదారి పట్టాడన్నది మూవీ.

ఇది పుష్పగాడి ప్రభంజనం, ఫైర్ ఫైర్ వైల్డ్ ఫైర్ అంటూ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరుపులతో బయటకు వచ్చారు. అంచనాలను మించి ఉందని, అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అయితే పిచ్చెక్కించిందని చెబుతున్నారు. దర్శకుడు రాజమౌళి చెప్పినట్టుగా.. ఈ ఎంట్రీ సీన్ అదుర్స్ అంటున్నారు. ఇంట్రడక్షన్, ప్రి ఇంటర్వెల్, ఇంటర్వెల్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు. సినిమా పెద్దది కావడంతో.. మెయిన్ విలనిజం లేదని.. విలన్లు మారిపోతూ ఉంటారని చెప్పారు. సెంటిమెంట్ కోసం సెకండాఫ్ లో కొన్ని సీన్లను లెంత్ చేశారని అంటున్నారు. ఐతే.. సినిమాలో డైలాగ్స్ అయితే వేరే లెవెల్ అని, ప్రతి ఒక్కరికీ ఇంటర్వెల్ చూడగానే గూస్ బంప్స్ పక్కా అంటున్నారు.

జాతర సీన్ అయితే వేరే లెవెల్ అనీ.. సీఎంతో పుష్ప సీన్ అదిరిపోయిందని, బన్నీ ఊచకోత అని చెబుతున్నారు. ఐటమ్ సాంగ్ అదిరిపోయింది అంటున్నారు. మూవీకి ఎవరిని అడిగినా సూపర్ హిట్ టాక్ వస్తోంది. కంటెంట్, యాక్టింగ్, డైరెక్షన్, సాంగ్స్ 3.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు అన్నది సమీక్షకుల జస్టిఫికేషన్. మిక్స్ డ్ టాక్ అన్న ముచ్చటే లేదు.

Tags

Next Story