Pushpa 2 : పుష్ప-2 సెన్సార్ బోర్డ్ రివ్యూ.. ఇవే హైలైట్స్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమైన సినిమా‘పుష్ప 2’. ఈ పాన్ ఇండియా మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప-2 మూవీ సెన్సార్ కట్ పూర్తిచేసుకుంది. కొన్ని కట్స్ తో ఈ సినిమాకు UA సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా నిడివి 200 నిమిషాలు అంటే 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఇంతకంటే ఏ సీన్ ను కూడా తగ్గించే చాన్స్ లేదంటున్నారు మూవీ మేకర్స్. సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి బాగా వచ్చిందని చెబుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కు
మరోసారి జాతీయ అవార్డు దక్కుతుందని చెబుతున్నారు. అటు రష్మిక రోల్ కూడా ఈసారి ఎమోషనల్ గా ఉంటుందని.. భర్తను మంచివైపు నడిపించే భార్యగా రష్మిక.. భార్య మాట విన్న భర్త ఏం చేస్తాడన్నది అల్లు అర్జున్ తెరపై చూపించారట. ఇద్దరికీ అవార్డులు వస్తాయన్నది మరో రివ్యూ. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ... ట్రైలర్ లో చూపించిన దాని కంటే ఓ రేంజ్ లో సుకుమార్ ఈ మూవీని తీశారని అంటున్నారు. పుష్ప మూవీలో కొనసాగిన దానికంటే ఎక్కువ ట్విస్టులు కొనసాగుతాయని చెబుతున్నారు. జాతర సన్నివేశాలు, ప్రి-ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, క్లైమాక్స్, అల్లు అర్జున్- రష్మిక, అల్లు అర్జున్- ఫహాద్ ఫాజిల్ మధ్య సీన్స్ దుమ్ములేపుతాయంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com